Minister Guntakandla jagadeesh reddy commenced the renovation works of Lord Shiva temples in Gundlapally, Mellacheruvu villages of Matampally mandal, Suryapet district.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయం అభివృద్ది కోసం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి, మేళ్ళచెరువు మండలంలోని వేల్లేటూరు గ్రామంలో శివాలయాల పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చెశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా, భావితరాలకు ఆదర్శంగా తీసుకొనేలా ప్రాచీన సంస్కృతి ఉట్టిపడేలా దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
16 ముంపు గ్రామాలలోని 60 దేవాలయాల పున్ర్నిర్మాణ పనులకు పురావస్తు, దేవాలయ శాఖ ఆధ్వర్యంలో రూ. 18 కోట్ల 50 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.