NTVS against construction of Mission Bhageeratha water tank in Kandagatla Govt. School

NTVS against construction of Mission Bhageeratha water tank in Kandagatla Govt. School _ Bari Ashok

జి.ప.ఉ.పాఠశాల కందగట్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించొద్దని నవతెలంగాణ విధ్యార్ధి సంఘం వినతి
అసలే ఆ పాఠశాలకు ఆట స్థలం అతి కొద్దిపాటి.దాదాపు200 మంది విిద్యార్థులు చదువుతున్నారు. చదువుకుంటు ఆటలు ఆడి శారీరకంగా ఎదిగే దశ పాఠశాల దశ .అలాంటి పాఠశాలలో ఆటలు ఆడుకునే స్థలం కూడ లేకుండ మిషన్ భగీరథ ట్యాంక్ని నిర్మించడం పేద పిల్లల్ని ప్రభుత్వ విద్యకు దూరం చేయడమేనని నవ తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *బారి అశోక్ గారు* విమర్శించారు.

NTVS ఆటల పేరుతో నైన విద్యార్థులు రోజూ బడికి వచ్చి చదువు పై దృష్టి పెట్టె అవకాశం ఉందన్నారు.బడిలో ఆటలు.ఆట స్థలం లేకపోతే గ్రామంలోని పేద పిల్లలు బడికి రాకుండ వ్యవసాయ కూలీలుగా .గొర్రెల .మేకల కాపాలదారులుగా మారె అవకాశం ఉందన్నారు.ఇదేమిటి అని నిలదీసిన విద్యార్థి నాయకులను స్థానిక నాయకులు ,కాంట్రాక్టర్లు బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారన్నరు.పాఠశాల గేటు ముందు ధర్న నిర్వహించి ఆత్మకూర్ మండల విద్యాధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో అర్రూరి నరేష్.పోల్దాస్ లింగరాజ్ .బోనగిరి అశోక్.దండెంపల్లి పరమేష్.బొల్లె మహేష్.పోల్దాస్ రాజశేఖర్.రామకృష్ణ,ఉదయ్.నవీన్,నరేష్,రమేష్,మధు,సతీష్,గోవర్థన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *